అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ అనుకున్నట్లే బాంబు పేల్చింది. భారత్‌కు సంబంధించి మరో సంచలన విషయాన్ని బయటపెట్టనున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. ఈ సారి సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొంది.
గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్లలో మాధవి పురి, ఆమె భర్త ధావల్ బచ్‌లకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ పేర్కొంది. గతేడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించింది. ఇప్పుడు అదే సంస్థ సెబీని టార్గెట్ చేయడం గమనార్హం. దీనిపై సెబీ స్పందించలేదు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సెంచరీతో కొత్త రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీబోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సాలిడ్ డిఫెన్స్ తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్ ను మంత్రడండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ దాటేసి…
- నాకు కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయివికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్సీసీ విద్యార్థిని అని తెలిపారు. ఆ సమయంలో తాను పొందిన అనుభవం అమూల్యమైనదని…
- ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ కేసుఅదానీ ముడుపుల వ్యవహారం రాష్ట్రం, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ప్రధాని జోక్యం…
- భక్త జనసంద్రంగా మారిన యాదాద్రి దేవాలయంయాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. కార్తీకమాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. కార్తీక దీపారాధన పూజలు, సత్యనారాయణ స్వామి…
- సుప్రీంకు చేరిన అదానీ కేసు…అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ముడుపుల వ్యవహరాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హిడెన్ బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు చేయాలని విశాల్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి