52
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. నెల రోజుల కాలంలో కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత నెల రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 8.50 లక్షల కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. వీరిలో 1.18 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారని తెలిపింది. 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మరో 1,600 మందికి పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా 70 లక్షల మంది మరణించారని తెలిపింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించేందుకు యత్నించాలని చెప్పింది.
Read Also..
Read Also..