తొలిసారిగా ఘన ఇంధన మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైల్(Ballistic Missile) వాడకం..
మధ్యశ్రేణి హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ను డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా విజయవంతంగా పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ప్రయోగంలో ఉత్తర కొరియా(North Korea) కొత్త విధానాన్ని ఉపయోగించినట్లు తెలిపింది. తొలిసారిగా మధ్యశ్రేణి ఘన ఇంధన బాలిస్టిక్ మిస్సైల్ ‘వాసోంగ్ఫో 16బీ(Wasongpho 16b)’ని ప్రయోగించినట్లు వార్తాసంస్థ వివరించింది.
101 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి..
ఇందులో తొలిసారిగా అభివృద్ధి చేసిన హైపర్ సోనిక్ గ్లైడింగ్ వార్ హెడ్(Hypersonic Gliding Warhead) ను కూడా వాడారని పేర్కొంది. దేశ రాజధాని పాంగ్ యాంగ్ శివార్లలోని సైనిక శిక్షణ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు వార్తాసంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా మిసైల్ తొలి దశలో 101.1 కిలోమీటర్ల ఎత్తుకు, రెండో దశలో 72.3 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని చివరకు వెయ్యి కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంది. ఆ తర్వాత అది నిర్దేశిత కచ్చితత్వంతో కొరియా ద్వీపకల్పంలోని సముద్రజలాల్లో పడిపోయింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) హర్షం వ్యక్తం..
క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశ సైనిక శాస్ర్త, సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని చాటేందుకు ఇదో శక్తిమంతమైన, వ్యూహాత్మకమైన ఆయుధమని పేర్కొన్నారు. శత్రు దేశాలను నియంత్రించేందుకు అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయడం దేశం ముందున్న అతిపెద్ద బాధ్యతని చెప్పారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: Mumbai Vs Rajasthan IPL 2024 | ముంబై పై రాజస్థాన్ ఘన విజయం
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి