షెహబాజ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు:
పాకిస్థాన్(Pakistan) నూతన ప్రధాన మంత్రిగా తిరిగి రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన షెహబాజ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా నేను ఎన్నికైన వేళ అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ(Narendra Modi)కి ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా షరీఫ్ ఒక పోస్ట్ పెట్టారు.
షెహబాబ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జాతీయ అసెంబ్లీలో తొలి ప్రసంగంలో షెహబాబ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్(Pakistan)ను ఆటలో భాగం కానివ్వబోనని అన్నారు. సమానత్వం ప్రాతిపదికన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని అన్నారు. అయితే కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. పాలస్తీనా సమస్యతో పోల్చడం గమనార్హం. కాగా 2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక దళ స్థావరంపై పాక్ తీవ్రవాద గ్రూపులు దాడులు జరిపిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆ తర్వాత ఫిబ్రవరి 26, 2019న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల(CRPF jawans) మరణానికి ప్రతిస్పందనగా భారత్ ప్రతీకార దాడి చేసింది. ఫిబ్రవరి 26, 2019న పాక్‌లోని జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా సన్నగిల్లాయి.
ఇది చదవండి: పూర్తయిన సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి