అర్ధ శతకంతో రికార్డు అందుకున్న విరాట్ కోహ్లీ(Virat Kohli T20)..
టీమిండియా(Team India 2024) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేశాడు. ఐపీఎల్(IPL)లో పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) మధ్య మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్(Match 2024)లో మొత్తం 77 పరుగులు బాది ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ క్రికెట్లో అత్యంత మైలురాయిని చేరుకున్నాడు.
టీ20 క్రికెట్(T20 cricket)లో 3వ స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ..
టీ20 క్రికెట్లో 50 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. పంజాబ్‌పై హాఫ్ సెంచరీతో పొట్టి క్రికెట్ ఫార్మాట్లో 100వ సారి 50 కంటే ఎక్కువ స్కోరును అందుకున్నాడు. ఇందులో 92 అర్ధ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో ఎక్కువసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ మొత్తం 110 సార్లు 50కిపైగా స్కోర్లు చేశాడు. రెండవ స్థానంలో నిలిచిన ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 109 సార్లు ఈ మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో నిలిచారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: టీ20 చరిత్రలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి