సంగారెడ్డి ప్రజలు నాకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారు జగ్గారెడ్డి. నాకు ఓట్లు వేసిన 65 వేల మందికి అలాగే నాకు ఓట్లు వేయని 71వేల మందికి జగ్గారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. సంగారెడ్డి ప్రజలు నాకు కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అలాగే 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇచ్చారు. 2014 లో ఓడించారు. మళ్ళీ 2018 లో ఎమ్మెల్యే గా గెలిపించారు. కానీ ప్రభుత్వం రాలేదు. 2023 అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను ఓడించారు. మీ తీర్పు ని గౌరవిస్తున్న, స్వాగతిస్తున్న.. మీకు 24 గంటలో అందుబాటులో ఉండే వారిని ఎమ్మెల్యే గా గెలిపించుకున్నారు. ఆ ఎమ్మెల్యే తో పని చేయించుకోండ.. నేను హైదరాబాద్ లో ఉండి కాంగ్రెస్ పార్టీ పధకాలు అమలు అయ్యేలా చూస్తా అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటా. అలాగే మీకు 24గంటలు ఫోన్ లో ఏ సమయానికి ఫోన్ చేసిన అందుబాటులో ఉండే మాజీ మంత్రి హరీష్ రావు, ఇప్పుడు గెలిచినా ఎమ్మెల్యే తో పనులు చేయించుకోండి.
ప్రజల తీర్పును స్వాగతిస్తున్న.. జగ్గారెడ్డి
60
previous post