పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం

Advertisements

<p>దేశంలోని కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది&period; పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది&period; ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ&period;5 లక్షల వరకు ఉండే పీఎఫ్ క్లెయిమ్‌లను ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పద్ధతి ద్వారా ఆటోమేటిక్‌గా ఆమోదించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; అయితే&comma; అందుకు సంబంధించిన EPFO కొత్త డిపాజిట్ వ్యవస్థ నేటి నుంచే అధికారికంగా ప్రారంభమైంది&period;<&sol;p>&NewLine;<p>కొత్తగా చేపట్టిన ఈ టెక్నికల్ మార్పుల వల్ల ఇక నుంచి పీఎఫ్ సేవలు శరవేగంగా సాగనున్నాయి&period; ఇది వరకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు వారాల తరబడి వేచి చూడాల్సి రాగా&period;&period; ఇకపై రోజుల్లోనే పని పూర్తి కానుంది&period; అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరి పీఎఫ్ వివరాలను ఒకే కేంద్రీకృత డేటాబేస్ పరిధిలోకి తీసుకువచ్చారు&period; దీంతో ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుంచైనా తమ పీఎఫ్ వివరాలను ఒకే చోట సులభంగా చూసుకోవచ్చు&period; జూలై 15 నాటికి ఖాతాల్లో జమ అయిన మొత్తానికి ప్రభుత్వం అందించే పీఎఫ్ వడ్డీ జమ చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.