35 ఏళ్ల క్రితం అక్కడంతా తుమ్మ పొదలు చెత్త చెదరాలు అక్కడికి వెళ్లాలంటే అంత చిత్తడిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ స్థలం పట్టణంలోని నడిబొడ్డున ఉంది. అయినప్పటికీ అప్పుడున్న బతుకులు మాత్రం అలాగే ఉన్నాయి కానీ ఆ ఏరియా మాత్రం లక్షల నుంచి కోట్ల వరకు చేరింది. దీంతో మొన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న కొందరు కబ్జాదారులు ఈ కాస్ట్లీ స్థలంపై కన్ను పడింది.ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు… ఇంకేముందీ నిరుపేదల కడుపు కొట్టాలని చూస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని కూలీ చేసుకుంటూ బతుకుతున్న తమకు ఇల్లు పట్టాలు ఇవ్వాలంటూ తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని కొందరు నిరుపేదలు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ సమీపంలో ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న ఏరియా ఇప్పుడున్న పరిస్థితులలో చదరపు గజానికి లక్షల్లో ధర పలుకుతుంది. దీంతో కబ్జాదారుల కన్ను దీనిపై పడింది. మీకు సహాయం చేస్తామంటూనే కొందరు రాజకీయ నాయకులు నిరుపేదల కడుపు కొట్టె ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిరుపేదలకు భరోసా కల్పిస్తుంటున్నారు. పొట్ట చేత పట్టుకుని 35 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి కూలీ నాలీ చేసుకుంటూ చిన్నచిన్న ఇల్లు కట్టుకున్న 25 కుటుంబాలు ప్రజలు ఉంటున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…అయితే తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాల్సింది పోను నానా రకాలుగా నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు.కూలీ పనులు చేసుకునే నిరుపేదల కడుపులను కొట్టవద్దని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి మూర్తి అంటున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో వారికి త్వరలో ఇల్లు కట్టించి కనీస సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.