వనపర్తి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 296 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. దాదాపు అన్ని చోట్ల లోపల, బయట సి సి కెమెరా లు పెట్టడం జరిగిందని, వాటిని కంట్రోల్ రూం నుండి నియంత్రించడం జరుగుతుందన్నారు. 1587 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి రూట్ అధికారులు, సెక్టోరియల్ , మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 271151 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 135654 మంది మహిళా ఓటర్లు 135491 మంది ఇతరులు 6 మంది ఉన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కంటే పోలింగ్ శాతం పెంచేందుకు 5 మహిళా పోలింగ్ కేంద్రాలు, ఒక పి. డబ్లు.డి, మండలానికి ఒకటి చొప్పున 7 మాడల్ పోలింగ్ కేంద్రాలు, ఒక యువ ఓటర్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని 541 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన పోలీస్, రిజర్వు బలగాలు ఏర్పాటు చేయడం, ఎన్నికలు శాంతియుతంగా స్వేచ్చగా జర్పించెందుకు అసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టడం జరిగిందన్నారు. వంద మీటర్ల పరిధి, 200 మీటర్ల పరిధి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు.