వచ్చే ఏడాది బ్రిటన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిషి సునాక్ ప్రభుత్వం దేశంలోకి వలసల నిరోధానికి రంగంలోకి దిగింది. అధికవేతనాలున్న వారికే ఉపాధి వీసాలు దక్కేలా కొత్త రూల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ హౌస్ ఆఫ్ కామన్స్‌లో బిల్లు పెట్టారు. దీనికి ఆమోదం దక్కితే భారతీయులపై తీవ్ర ప్రభావం తప్పదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా బిల్లులో వీసా నిబంధనల్లో పలుమార్పులు చేశారు.
బ్రిటన్ స్కిల్డ్ వర్కర్ వీసా పొందేందుకు గతంలో కనీసం వేతనం 26వేల200 పౌండ్లుగా ఉండేది. తాజాగా ఈ వేతనాన్ని 38వేల700 పౌండ్ల వరకూ పెంచారు. ఇక కుటుంబ వీసాకు గతంలో కనీస వేతనం 18వేల600 కాగా ప్రస్తుతం దీన్ని కూడా 38వేల700 పౌండ్లకు పెంచారు. హెల్త్ అండ్ కేర్ వీసాదారులు ఇకపై తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురాలేరు. కేర్ క్వాలిటీ కమిషన్ పర్యవేక్షణలోని కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే వారు ఇతరులకు వీసాను స్పాన్సర్ చేయగలరు. స్టూడెంట్ వీసాపై ప్రస్తుతం అమలవుతున్న కఠిన నిబంధనలు వలసలను చాలావరకూ తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also…
Read Also…