కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. నేను ఎంపీ పదవికి రాజీనామా ఇచ్చాను. అనంతరం గడ్కరీ ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాను. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించాలని చాలా కాలంగా కోరుతున్నాను. రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి కూడా ఆయనతో చర్చించాను. సీఆర్ఎఫ్ నిధులు తెలంగాణకు తక్కువగా వచ్చాయి. వాటిని పెంచాలని కోరాను. అలాగే కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు గా చేయాలని కోరాను. మళ్లీ మరోసారి ప్రత్యేకంగా తెలంగాణ రోడ్ల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దాం అన్నారు. తెలంగాణకు బెస్ట్ రోడ్స్ తీసుకొచ్చేందుకు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎంత కృషి చేశానో ఇప్పుడు మంత్రిగా అలాగే రాష్ట్రం మొత్తం రోడ్స్ కోసం ప్రయత్నిస్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఏపీ భవన్, తెలంగాణ భవన్ పంపకాల గురించి కూడా రేపు పరిశీలన చేస్తాం. కొత్త తెలంగాణ భవన్ కోసం సీఎం తో చర్చిస్తాను. ఒకట్రెండు నెలల్లో నిర్ణయం తీసుకుని, మార్చి లోపు కొత్త తెలంగాణ భవన్ కు శంఖుస్థాపన చేస్తాం. ఏడాది లోగా నిర్మాణం పూర్తి చేస్తాం. భవన్ విభజనలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉంటే చాలు. కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. నాకు నల్గొండ రాజకీయ జన్మ ఇచ్చింది. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నాకు పునర్జన్మ ఇచ్చింది. భువనగిరి ప్రజలకు నేను రుణపడి ఉంటాను.
కేంద్ర మంత్రితో తెలంగాణ మంత్రి వెంకట్ రెడ్డి భేటీ..
70
previous post