66
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు జాతీయ రహదారిపై విజయనగరం వెళ్తున్న లారీ డ్రైవర్, హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. టైల్స్ లోడుతో విజయనగరం వెళ్తున్న లారీ డ్రైవర్ కు గుండెల్లో నొప్పి రావడంతో తనకు ఇబ్బందిగా ఉందని క్లీనర్ తో చెప్పి లారీ పక్కకు ఆపి స్టీరింగ్ పై కుప్ప కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు శేషు గోపి, ఎన్టీఆర్ జిల్లా కొండాకు మండలం కుంటముక్కల గ్రామంగా పోలీసులు గుర్తించారు.