వరుస పేపర్ లీక్ లతో సతమతమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైనవారిపై చట్టపరంగాచర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తీసుకువచ్చింది. పరీక్షల పేపర్ లీక్ ల గందరగోళం మధ్య, కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ ని అమలు చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పరీక్షల్లో అవకతవకలపై కఠిన చర్యలకు నిబంధనలు రూపొందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పబ్లిక్ పరీక్షా విధానంలో మరింత పారదర్శకత, సరసత, విశ్వసనీయతను తీసుకురావడానికి అన్యాయమైన మార్గాలను నిరోధించడం దీని లక్ష్యం. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి షురూ అవ్వడంతో అమలు తేదీని ప్రకటించలేదు.పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్దంగా పరీక్ష పేపర్లను అందుకున్నా..ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్ వర్క్ ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, ఫేక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10ఏండ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దీనిలో భాగస్వాములు, వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేస్తారు.పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.