69
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురు గాలులతో పాంచజన్యం వసతి గృహం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. పార్కింగ్ లో ఉన్న కారుల పై పడడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఇక సమయానికి కారులో భక్తులు ఎవ్వరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. దింతో వెంటనే టిటిడి ఫారెస్ట్, ఫైర్ సిబ్బంది స్పందించారు. నేలకొరిగిన చెట్టును కట్ చేసి తొలగిస్తున్నారు.
Read Also..