ముంబైలో ఘోర ప్రమాదం.

ముంబైలో ఘోర ప్రమాదం

Advertisements

<p>ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి&period; గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమవుతోంది&period; ప్రధాన రోడ్లు&comma; లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి&period; పలు ప్రాంతాల్లో చెట్లు&comma; ఇళ్లు కూలిపోతున్నాయి&period; భారీ వర్షాలకు ముంబై మాన్‌ఖుర్ద్‌లోని జనతానగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది&period; 4 అంతస్తుల భవనం కుప్పకూలింది&period; ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు&period; మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం&period;<&sol;p>&NewLine;<p>ఐతే రానున్న 5 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ముంబైకి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ&period; దీంతో ఇవాళ ముంబైలోని అన్ని ప్రభుత్వ&comma; ప్రైవేట్ పాఠశాలలు&comma; కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం&period; తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో&period;&period;విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది&period; అయితే ముంబైలోని అన్ని ప్రభుత్వ&comma; ప్రైవేట్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది&period; ఇక ముంబైలో 24 గంటల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది&period; భారీ వర్షాలతో వీధులన్నీ జలమయమయ్యాయి&period; జనజీవనం స్తంభించింది&period; చాలా చోట్ల చెట్లు కూలడంతో కొందరు మృత్యువాత పడ్డారు&period; విమానాలు&comma; రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది&period; దీంతో పలు విమానాలు రద్దు చేశారు&comma; మరికొన్ని దారి మళ్లించారు&period; ముంబైకి రెడ్‌ అలర్ట్‌ ప్రకటించడంతో అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు అధికారులు&period; అలలు ఎగిసిపడే అవకాశం ఉందని&comma; తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు&period; గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది&period; థానే&comma; నవీ ముంబై&comma; పాల్ఘర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.