గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు.

Advertisements

<p>2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది&period; ఈ కేసులో 38 మందికి ఉరిశిక్ష&comma; 11 మందికి జీవితఖైదు విధించింది&period; ఈ కేసులో 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది&period; పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు రూ&period;10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఈ మేరకు జస్టిస్ ఏవై కోగ్జే&comma; జస్టిస్ ఎస్‌జే దవేలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది&period;<&sol;p>&NewLine;<p>2008 జులై 26à°¨ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు&period; కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు&period; రద్దీగా ఉండే మార్కెట్లు&comma; బస్సులు మాత్రమే కాకుండా&comma; మొదటి విడత పేలుళ్లలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు&period; ఈ పేలుళ్లలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 246 మంది తీవ్రంగా గాయపడ్డారు&period; ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ క్రైమ్ బ్రాంచ్&period;&period; 100 మందికి పైగా నిందితులుగా పేర్కొంది&period; 78 మందిపై విచారణ జరిగింది&period; అహ్మదాబాద్‌లో నమోదైన 20 ఎఫ్‌ఐఆర్‌లు&comma; సూరత్‌లో నమోదైన 15 ఎఫ్‌ఐఆర్‌లతో కలిపి మొత్తం 35 కేసులను విలీనం చేసి సుదీర్ఘ విచారణ జరిపారు&period; ఈ క్రమంలో 9 మంది వేర్వేరు న్యాయమూర్తుల ముందు 1&comma;163 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది&period; భద్రతా కారణాల దృష్ట్యా 26 మంది కీలక సాక్షుల పేర్లను గోప్యంగా ఉంచారు&period;<&sol;p>&NewLine;<p>గుజరాత్ హైకోర్టు హైకోర్టుకు చేరిన ఈ కేసులో గత రెండున్నరేళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది&period; విచారణ సందర్భంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిదీన్&comma; సిమిలకి చెందిన ఉగ్రవాదులు కలిసి ఈ దారుణ కుట్రకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో బలంగా నిరూపించింది&period; దీంతో నిందితులపై దేశద్రోహం&comma; హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద మోపిన చార్జీలను న్యాయస్థానం సమర్థించింది&period; ఈ మేరకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఇవాళ తుది తీర్పు వెలువరించింది&period; అయితే దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో &lpar;38 మందికి&rpar; ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే తొలిసారి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.