ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌చంద్రకు ప్రధాని మోదీ నివాళి.

Advertisements

<p>ప్రముఖ బెంగాలీ రచయిత&comma; బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150à°µ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు&period; ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ&period;&period; శరత్‌చంద్ర సాహిత్య వైభవాన్ని&comma; సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకున్నారు&period;శరత్‌చంద్ర రచనలు కేవలం బెంగాలీ భాషకే పరిమితం కాలేదని&comma; దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయని ప్రధాని పేర్కొన్నారు&period; 19à°µ శతాబ్దపు భారతదేశాన్ని&comma; ముఖ్యంగా గ్రామీణ బెంగాలీ సామాజిక పరిస్థితులను ఆయన తన రచనల్లో అత్యంత వాస్తవికతతో ఆవిష్కరించారని కొనియాడారు&period; నేటికీ ఆయన రచనలు విశేష ఆదరణ పొందడానికి ఇదే ప్రధాన కారణమని వెల్లడించారు&period;<br &sol;>&NewLine;కేవలం రచయితగానే కాకుండా&comma; సామాజిక సంస్కరణలు&comma; మహిళా హక్కులు&comma; జాతీయవాదం పట్ల శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ ప్రదర్శించిన నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకమని మోదీ ప్రశంసించారు&period; భావితరాల యువత ఆయన రచనలను మరింత ఎక్కువగా చదవాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.