నెహ్రూ రికార్డును బద్దలు కొట్టిన ప్రధాని మోదీ.

నెహ్రూ రికార్డును బద్దలు కొట్టిన ప్రధాని మోదీ

Advertisements

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు&period; దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ప్రజాస్వామ్యయుత ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించనున్నారు&period;స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52లో మనదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి&period; ఆ ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ మే 13&comma; 1952à°¨ ప్రమాణ స్వీకారం చేశారు&period; నాటి నుండి మే 27&comma; 1964à°¨ ఆయన మరణించే వరకు&period;&period; మొత్తం 4&comma;398 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా నెహ్రూ ప్రధానిగా కొనసాగారు&period;<&sol;p>&NewLine;<p>నరేంద్ర మోదీ మే 26&comma; 2014à°¨ తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు&period; నేటికి విరామం లేకుండా 4&comma;399 రోజులు పూర్తి చేసుకోనున్నారు&period; దీంతో నెహ్రూ రికార్డును ఒక్క రోజు తేడాతో అధిగమించి&comma; దేశంలోనే సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ఏకైక ప్రజాస్వామ్య అధినేతగా మోదీ నిలవనున్నారు&period; ఇంతకుముందు కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ మరో రికార్డును బద్దలుకొట్టారు&period; వరుసగా&comma; అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రికార్డును జూలై 5&comma; 2025à°¨ దాటేశారు&period; ఇందిరాగాంధీ జనవరి 24&comma; 1966à°¨ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి&comma; వరుసగా 4&comma;077 రోజులపాటు కొనసాగారు&period; ఆమె మార్చి 24&comma; 1977లో వరకు ప్రధానిగా కొనసాగారు&period; అలా&comma; ఇందిరా గాంధీ కంటే ఎక్కువ రోజులు వరుసగా ప్రధానిగా మోదీ కొనసాగుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక్కడ చెప్పుకోవల్సిన మరో రికార్డ్ ఏమిటంటే అక్టోబరు 7&comma; 2001 నుంచి మార్చి 22&comma; 2026 నాటికి నరేంద్ర మోదీ సీఎంగా&comma; పీఎంగా కలిపి మొత్తం 8&comma;931 రోజులు పూర్తి చేసుకున్నాడు… దీనితో భారతదేశ చరిత్రలోనే ఒక ఎన్నికైన ప్రభుత్వానికి అత్యంత సుదీర్ఘ కాలం అధిపతిగా పనిచేసిన నాయకుడిగా సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ 8&comma;930 రోజుల రికార్డును మోదీ బద్దలు కొట్టారు&period; నేటికి మోదీ పాలనా కాలం 9013 రోజులు పూర్తవుతుంది&period;<&sol;p>&NewLine;<p>జవహర్‌లాల్ నెహ్రూ&comma; నరేంద్ర మోదీ ఇద్దరూ భారతదేశ చరిత్రలో అత్యంత పరివర్తనాత్మక కాలాల్లో దేశాన్ని నడిపించారు&period; శతాబ్దాల వలస పాలన తర్వాత విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థ&comma; రాజకీయ అస్థిరత&comma; సంస్థాగత నిర్మాణం లేని ఒక నూతన స్వాతంత్ర్య దేశానికి నెహ్రూ పునాదులు వేశారు&period; నాడు కేవలం 34 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి రాజకీయ స్థిరత్వం&comma; ఆర్థిక స్వావలంబనను చేకూర్చడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం&period; అయితే&comma; ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్న నేటి భారతదేశం పరిమాణంలో చాలా పెద్దది 140 కోట్లకు పైగా జనాభా&comma; ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నది&comma; అంతర్జాతీయ పరిణామాలకు వేగంగా ప్రభావితమయ్యేది&period; అందువల్ల ఈ పోలిక&comma; ఎవరు ఎక్కువ సవాళ్లను ఎదుర్కొన్నారు అనే దానికంటే&comma; దశాబ్దాలుగా సంక్షోభాల స్వభావం ఎంత సంక్లిష్టంగా మారిందనే దానికి నిదర్శనం&period;<&sol;p>&NewLine;<p>రికార్డులు సాధించడం ఒక విషయం&comma; ఆ రికార్డును చరిత్రలో గొప్పగా నిలబెట్టడం మరొక విషయం&period; నేటితో మోదీ సాధించనున్న ఈ చారిత్రక మైలురాయి భారత రాజకీయాల్లో ఒక యుగం ముగిసి&comma; కొత్త యుగం మొదలవుతోందని సూచిస్తోంది&period; ఈ దీర్ఘకాలిక నాయకత్వం దేశానికి ఎంతటి మేలు చేస్తుందనేది కాలమే చెప్పాలి&period; ఈ రికార్డు మోదీకి మీ దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.