జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir)
జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఉమ్మడిగా శ్రీనగర్(Srinagar)లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్(Jaish Mohammed)తో సంబంధమున్న నలుగురు ప్రధాన ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరివద్ద పేలుడుకి ఉపయోగించే అమ్మోనియంతో పాటు ఆయుధాలను గుర్తించినట్టు పోలీసులు(Police) వెల్లడించారు. ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో శ్రీనగర్శివారు ప్రాంతమైన నౌగామ్‌లోని కెనిహామా ప్రాంతంలో మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఉగ్రవాదులను పట్టుకున్నామని వెల్లడించారు. నిర్దిష్టమైన సమాచారం ఉండడంతో శ్రీనగర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు ఉమ్మడిగా ఈ పోస్టును ఏర్పాటు చేశామని ప్రకటన విడుదల చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఛత్తీస్‌గఢ్ లో మరోసారి కాల్పులు కలకలం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి