ఈసీ(EC) కీలక ఆదేశాలు జారీ..
ఢిల్లీ(Delhi) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్(Exit polls)కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ(EC) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్ రోజు అయిన జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. అలాగే పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్(Electronic) మీడియాలో ఫలితాల గురించి అంచనాలతోపాటు ఇతర ఎలాంటి సర్వేలనూ ప్రసారం చేయకూడదని పేర్కొంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: పార్లమెంట్ ఎన్నికల రెండవ దశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి