పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వేళ హర్యానా(Haryana) రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హర్యానా(Haryana) సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఖట్టర్ గవర్నర్‌కు సమర్పించారు. ఖట్టర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే స్వతంత్రుల మద్దతుతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు ఖట్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ-జేజేపీ(BJP-JJP) సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు, ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో కేంద్రమంత్రి అర్జున్ ముండా, తరుణ్ చుగ్ హుటాహుటిన హర్యానా(Haryana) వెళ్లారు. హర్యానా(Haryana)లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. కాగా, పార్లమెంట్ ఎన్నికల ముంగిట సీఎం రాజీనామా హర్యానా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నేడు SBI పిటిషన్‌పై విచారణ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి