సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరం ద్వారకను ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ ద్వారా సందర్శించారు. జలగర్భంలో శ్రీకృష్ణుడికి భక్తిపూర్వకంగా ప్రార్థనలు జరిపారు. అనేక సంవత్సరాలుగా ద్వారకను సందర్శించాలని అనుకుంటున్నానని, ఇప్పటికి ఈ కోరిక నెరవేరిందని, ఇదొక దివ్య అనుభూతి అని సముద్రం నుంచి బయటకు వచ్చిన అనంతరం మోదీ తెలిపారు. సముద్రంలో ఉన్న ద్వారక నగర అవశేషాలను సందర్శించటానికి పంచ్కుయి బీచ్ నుంచి స్కూబా డైవింగ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం
ఆయనకు సాయంగా నౌకాదళ డైవర్లు కూడా సముద్రంలోకి వెళ్లారు. సముద్ర గర్భంలో మోదీ పద్మాసనం వేసి, ముఖులిత హస్తాలతో శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. నెమలి ఈకలను సమర్పించారు. బయటకు వచ్చిన తర్వాత మోదీ మాట్లాడుతూ అత్యంత దివ్యమైన అనుభూతి కలిగిందని, ద్వారక సందర్శనకు ధైర్యంకన్నా విశ్వాసమే కీలకమని చెప్పారు. ప్రాచీన నగరాన్ని స్పృశించినప్పుడు 21వ శతాబ్దంలో వైభవోపేత భారతదేశం తనముందు కదలాడిందని, చాలాసేపు నీళ్లలోనే గడిపానని మోదీ తెలిపారు. ద్వారకను సందర్శించాలన్న తన కోరిక దశాబ్దాల నాటిదని, ఇప్పుడు అది పూర్తి కావటంతో అపరిమితమైన సంతోషం కలిగిందని మోదీ తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.