7
జార్ఖండ్‌లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 28న హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో హేమంత్ సోరెన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాజ్ భవన్‌కు వెళ్లిన సోరెన్ గవర్నర్ తో భేటీ అయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేసి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను అందజేశారు. ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది.…
- ఒకే వేదికపై పొన్నం, హరీశ్ రావురాజకీయాల్లో నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఒకే వేదికపై సరదాగా గడిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్ రావు క్రికెట్ ఆడారు. ఓ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ స్టేజిపై క్రికేట్ ఆడి అక్కడున్నవారిలో…
- ఈనెల 29 న ఏపీలో మోదీ పర్యటనకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నానికి రానున్నారు . ఈ నెల 29న విశాఖకు రానున్న మోదీ. ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.…
- శ్రీశైలం ఘాట్ రోడ్డులో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులతో పాటు కార్తీక మాసం ముగుస్తుండటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు వాహనాల…
- మద్యం మత్తులో మందుబాబు … ట్రాఫిక్ పోలీసులకు చుక్కలుహైదరాబాద్ లోని చంపాపేట్‌లో శనివారం రాత్రి మద్యం సేవించి ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. చెకింగ్ చేస్తున్న మీర్‌చౌక్ పోలీసులు అతన్ని ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం మత్తులో ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి