దేశీయ స్టాక్ మార్కెట్(Stock market) సూచీలు..
నిన్న బేర్ దెబ్బకు కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ కాస్త పుంజుకున్నాయి. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 89.64 పాయింట్ల లాభంతో 72 వేల 101.69 వద్ద ముగియగా..నిఫ్టీ 21.65 పాయింట్ల లాభంతో 21 వేల 839.10 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో.. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫెడ్ నిర్ణయాలు రేపటి మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే అవకాశముందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి