Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home National ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!

by Satya
Narendra Modi

స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ..

ప్రస్తుతం దేశంలో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని దీని ద్వారా 12 లక్షల మంది యువత ఉపాధిని పొందుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. ఢిల్లీ(Delhi) లోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన స్టార్టప్(Startup) మహాకుంభ్ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. దేశంలోని స్టార్టప్‌(Startup)లలో 45 శాతం పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని ప్రధాని వెల్లడించారు. ఈ క్రమంలో వ్యవసాయం, జౌళి, వైద్యం, రవాణా, అంతరిక్షం, యోగా, ఆయుర్వేదం వంటి రంగాల్లో స్టార్టప్‌లు మొదలైనందుకు సంతోషిస్తున్నట్లు మోదీ తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరోవైపు రాజకీయాల్లో కూడా కొంతమంది స్టార్టప్‌లు ప్రారంభిస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. అలాంటి వారు ప్రయోగం విజయవంతం కాకపోతే, వెంటనే మరొకదానికి వెళ్లాలని సూచించారు. భారతీయ స్టార్టప్‌లు 50కి పైగా అంతరిక్ష రంగాలలో పని చేస్తున్నాయని చెప్పారు. గత దశాబ్దంలో ఐటి, సాఫ్ట్‌వేర్ రంగంలో భారతదేశం గొప్ప పురోగతిని సాధించిందని మోదీ అన్నారు. ఇప్పుడు భారతదేశం ఆవిష్కరణ, స్టార్టప్ సంస్కృతిని కూడా అభివృద్ధి చేయడంలో వేగంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.

ఇది చదవండి: బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై నిఘా…


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
బీహార్‌లో ఉగ్రరూపం దాల్చిన వరదలు.
బీహార్‌లో భారీ వర్షాలకు తోడు నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో నదులు ఉగ్రరూపం దాల్చాయి. …
ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం.
ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిభావంతులైన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: