దేశంలో ఏప్రిల్(April) నుంచి జూన్(Jun) వరకు మూడు నెలల పాటు ఎండ(Sunny)లు మండిపోనున్నాయని భారత వాతావరణ విభాగం -IMD ప్రకటించింది. విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు వేడి గాలులు వీచేవని, ఈ సారి పది నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశముందని మహాపాత్ర హెచ్చరించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి