వైరల్ వ్యాధి మంకీ పాక్స్ ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ ఈవిధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. తొలుత డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడిన ఈ వ్యాధి, తర్వాత శరవేగంగా ఇరుగుపొరుగు ఆఫ్రికా దేశాలలో వ్యాపించింది. దీని వల్ల ప్రధానంగా గర్భిణులు, పిల్లలకు రిస్క్ ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకు 13 దేశాలకు చెందిన పిల్లలు, యువతలో మంకీ పాక్స్ కేసులను పెద్దసంఖ్యలో గుర్తించారు. ఆయా దేశాల్లో దాదాపు 500 మందికిపైగా ఈ వ్యాధి వల్ల చనిపోయారని సమాచారం.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో మంకీ పాక్స్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో డబ్ల్యూహెచ్ఓ అలర్ట్ అయింది. విజృంభిస్తున్నమంకీ పాక్స్ వైరస్. ఈ వైరల్ వ్యాధికి వ్యాక్సిన్ లభ్యత కూడా ప్రస్తుతం అంతగా లేకపోవడంతో ఆందోళనలు మిన్నంటాయి. ఈనేపథ్యంలోనే ఇతర ప్రపంచ దేశాలలో మంకీ పాక్స్ వ్యాపించకుండా ఉండేందుకుగానూ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా దాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈమేరకు వివరాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
- విజయవాడ మేయర్ కు పదవీ ముప్పువిజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల…
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
- JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి