515
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వెలసిన హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో వేకువజామున మూలవిరాట్ కు అభిషేకాలు, అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మూలవిరాట్ స్వామివారి ప్రత్యేక పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రధంలో గుత్తి పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.