టిడ్కో గృహాలు (Tidco Homes):
చిలకలూరిపేట పట్టణంలోని టిడ్కో గృహ సముదాయంలో మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 52 ఎకరాలను టిడ్కో గృహాల్లో నివసించే ప్రజలను వివరాలు అడిగి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహసముదాయ నిర్మాణంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఎలక్షన్ సమయంలో జగన్ టిడ్కో గృహాలకు డబ్బు చెల్లించే పని లేదని ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
అధికారంలోకి వచ్చిన మొదలు ప్రజలను టిట్కో గృహాల్లో వెళ్ళనీయకుండా సరైన వసతులు లేకుండా బ్యాంకుల నుంచి నోటీసులు జారీ చేపిస్తూ ప్రజలను నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో 4,500 గృహాలు నిర్మించి ఇచ్చినా కనీస మౌలిక వసతులు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయిందని ఏద్దేవా చేశారు. ప్రస్తుతం ఇక్కడ నివసించే పేదవారికి కనీస వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పేర్కొన్నారు. మరలా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినాక ఇక్కడి గృహాలు పేదలు రూపాయి కట్టే పని లేకుండా చేయటంతో పాటు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.