78
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయుడు విద్యార్థినికి తాళి కట్టి ప్రేమ, పెళ్లి పేరుతో వంచించి అత్యాచారం కి పాల్పడ్డాడు. భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు ఉండి మండలం యoడగండి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని పని చేస్తున్నాడు. అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లి సోమరాజు అక్కడే తాళి కట్టి పెళ్లైందని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజు పై అత్యాచారం, పోక్సో బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. సోమరాజుకి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. 2018లో ఉద్యోగం రాగ ఈ ఘతుకానికి పాల్పడ్డాడు.