శ్రీకాకుళం జిల్లా.. గార ఎస్బిఐ డిప్యూటీ మేనేజర్ ఉరిటి స్వప్నప్రియ నిన్న రాత్రి పాయిజన్ తాగి ఆత్మహత్యయత్నంకి పాల్పడ్డారు. విశాఖలోని కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. స్వప్న ప్రియ పనిచేస్తున్న బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మిస్ అయిందంటూ, బంగారాన్ని స్వప్న ప్రియే మిస్ చేసిందంటూ ప్రధాన ఆరోపణలు చేశారు. తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునేందుకు గత పది రోజులుగా బ్యాంకు ను ఖాతాదారులు సంప్రదించడంతో బంగారం ఇవ్వకుండా ఆడిట్ పేరుతో బ్యాంక్ సిబ్బంది వాయిదా వేస్తూ వస్తున్నారు. ఖాతాదారుల ఆందోళనలతో బంగారం మిస్ అయ్యిందన్న ప్రచారంలో వాస్తవం లేదంటూ, డిసెంబర్ 8 నాటికి బ్యాంక్ ఆడిట్ పూర్తి చేసి ఖాతాదారుల బంగారాన్ని ఇచ్చేస్తామని అధికారులు
తెలిపారు. SBI అధికారులు ప్రకటించిన రెండు రోజులకే స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో బంగారం మిస్ అయ్యిందన్న ఆరోపణలకు బలం చేకూరుతుందని బాధిత ఖాతాదారులు వ్యక్తం చేస్తున్నారు.
Read Also..