70
శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి శ్రీరామ్ చిట్స్ మోసాలు కస్టమర్లు బైట పెట్టారు. శ్రీరామ్ చిట్స్ యాజమాన్యం పాత కష్టమర్ ల డాక్యూమెంట్ లతో లోన్లు వాడుకున్నారు. భాదితులకు కోర్టు నోటీసులు రావటం తో ఘరానా మోసం బైట పడింది. టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గర లో ఉన్న శ్రీరామ చిట్స్ ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర గందరగోళం నెలకొంది. వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకొని యాజమాన్యంకి చెందిన కొందరు సొంత అవసరాలకు డబ్బును వాడుకొని భారం వినియోదారులపై మోపి హింసిస్తున్నారు అంటూ ఒక మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ నెల సమయానికి డబ్బులు కట్టినా కట్టలేదంటు హింసిస్తున్నారని మరికొందరు భాదితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ భాదితులు మీడియాను ఆశ్రయించారు.
Read Also..