తిరుపతి లో దొంగ ఓట్లు అధికంగా నమోదు అయ్యాయి అని, పాత జాబితాలో చనిపోయిన వారి పెర్లు రెండు సార్లు నమోదు అయ్యాయి అని అధికారులు కు ఫిర్యాదు చేసామని, అధికారులు పట్టించుకోలేదని చనిపోయిన, రెండు ఓట్లు నమోదును అలాగే ఉంచేసారు అని ఆరోపించారు టీడీపీ యువత రాష్ట్ర నాయకుడు రజనీ. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అధికారి ఆదేశాలు భేఖాతరు చేస్తూ న్నారని,బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించలేదని,తాము క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించిన అందజేసినా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు విడుదల చేసిన జాబితా గందరగోళం గా ఉందని అన్నారు.మార్పులు, చేర్పులు ఎక్కడ ప్రస్తావించలేదని, అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఓటరు కార్డు ఆధార్ కార్డు లింకు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు. 26వ డివిజన్ లో మూడు వందలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారని, వాళ్ళు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదని వారిని అధికారులు చూపించగలరా అని ప్రశ్నించారు టీడీపీ యువత రాష్ట్ర నాయకుడు రజనీ.
Read Also..