107
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బి.కొత్తకోట కు చెందిన కే.బాలకృష్ణ (37) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలకృష్ణ ఇవాళ ఉదయం బి.కొత్తకోట సమీపంలోని ఏటి వద్ద శవంగా తేలాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు. విగతజీవిగా పడి ఉన్న బాలకృష్ణను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న బి.కొత్తకోట పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Read Also..