136
ప్రకాశం జిల్లా మార్కాపురం లో చెడ్డి గ్యాంగ్ అనుమానితుల కలకలం రేపింది. స్థానిక తూర్పు వీధిలో ఓ ఇంటి లోకి వెనక వైపు నుండి దొంగతనం చేయడానికి వెళ్తుండగా స్థానికులు గుర్తించారు. ఆ వ్యక్తిని పట్టుకొని వైఎస్సార్ విగ్రహం వద్ద ఉన్న మర్రిచెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు కొత్త వ్యక్తి కావడం విచిత్రంగా ఉండడంతో చెడ్డి గ్యాంగ్ కు చెందిన వ్యక్తి అని అనుమానంతో పోలీసులు విచారించి ఫింగర్ ప్రింట్స్ ను చెక్ చెయ్యగా మ్యాచ్ కాకపోవడంతో అనుమానితుడిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.