మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రబాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. చిరంజీవిని పట్టు వస్త్రాలతో సత్కరించారు. చిరంజీవి జన్మదినం సందర్బంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. చిరంజీవితో కలిసి ఆయన సతీమణి సురేఖ, మనవరాలు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా 2025లో చిరు విశ్వంభర అభిమానులను అలరించనుంది. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వశిష్ట డైరెక్షన్ లో చిరు ఈ సినిమా చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్ ఫాతిహా చదవాలని, రాయాలని స్కూల్ డైరీలో సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…
- సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను…
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212475