ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. జగన్నాథుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది జనం రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. రథయాత్రకు లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఈ క్రమంలోనే రథం లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు ఒకరు చనిపోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. రథయాత్రలో భాగంగా రథాన్ని లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో దాదాపు 400 మందికిపైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు, పోలీసులు స్పందించి.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
53 ఏళ్ల తర్వాత పూరీలో జగన్నీథుని రథయాత్ర రెండు రోజుల పాటు కొనసాగుతోంది. 1971 నుండి, రథయాత్ర కేవలం ఒక రోజు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల పాటు రథయాత్ర నిర్వహించారు. పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈసారి రెండు రోజుల పాటు రథయాత్ర నిర్వహించగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..భారత్-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది. భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు, ‘M777’ ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు, రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా…
- బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
- క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్‌తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
- చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
- తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తతెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80777