అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా అగ్రరాజ్యంలో గూగుల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను మార్చబోయే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిన్న ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వివరించారు. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించామన్నారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నామన్నారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఔటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదమని, టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారని, అలాగే కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందని గుర్తు చేశారు. భారత్‌లో రాష్టాలకు ఇలాంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్నారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలాంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందామన్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్నామని.తెలంగాణ ‘ఫ్యూచర్ స్టేట్’గా పిలుద్దామని ప్రకటించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
- వరంగల్‌లో డీఆర్ఐ అధికారుల సంచలన ఆపరేషన్..వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
- పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
- Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
- Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80413