ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై ఇరువరు చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాంధ్ర ప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది.
ఈ టాస్క్ ఫోర్స్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు. ఇక టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా ఉండనున్నారు. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో విజన్ 2047 రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక విశాఖలో టీసీఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలికమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చంద్రబాబునాయుడు చర్చించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 223767