శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ మృతి చెందారు. ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదో మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు. ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ మృతి చెందారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్ తిరుమలకు వచ్చారు. ఆయన స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్ మృతిపై ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
Thirupathi
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం.తిరుమల శ్రీవారిని నిన్న 67,198 మంది దర్శించుకున్న భక్తులు.నిన్న హుండీ ఆదాయం..4.19 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…22,452 మంది.21 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 12 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
తిరుమల క్షేత్రాన్ని రాజకీయ పునరావాస క్రంద్రంగా మారుస్తున్నారని, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను తిరుమల శ్రీవారి ఆలయం పై పడిందని ఈ నేపథ్యంలోనే తిరుపతి అభివృద్ధిలో భాగంగా ఒక్క శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారు కానీ బిజెపి తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో ప్రభుత్వం దానిని తిరస్కరించడంతో మరలా మొన్న జరిగిన పాలకమండలి సమావేశంలో కొత్తగా మరో ప్రతిపాదనను తీసుకొచ్చారని, ఇందులో తిరుపతిలో దాదాపు 39 డివిజన్లో సానిటరీ వర్క్ చేయడానికి నిధులు మళ్ళిస్తున్నారని ఆరోపించారు.అలాగే తిరుపతిలో రోడ్ల అభివృద్ధి కంటూ 100 కోట్లకు పైగా నిధులను పక్కదారి మల్లిస్తున్నారని ఆరోపించారు. చట్టంలో ఎక్కడా లేనివిధంగా శ్రీవారి నిధులను ఇలా సానిటరీ వర్కులకు రోడ్ల అభివృద్ధి కంటూ దారి మళ్ళిస్తున్నారని రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి శాసనసభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.తిరుపతి అభివృద్ధికి బిజేపి వ్యతిరేకం కాదని,టీటీడీ నిధులు ఇలా పక్కదారి పట్టడానికి వ్యతిరేకిస్తున్నామని దీనిపై టీటీడీలో జరుగుతున్న అవక తవకలను కచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అక్కడ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.దేశంలో ఎక్కడ ఏ దేవాలయం నిదుల తో అభివృద్ధి జరగడం లేదని,
ముఖ్యమంత్రి జగన్ ఇతర ఆర్గనైజేషన్ నుండి డబ్బులు తేగలరా అని ప్రశ్నించారు.తిరుపతి కి క్లీన్ సిటీ అవార్డ్లు వచ్చాయని ఇప్పుడు కొత్తగా టీటీడీ నిధులతో తిరుపతి రోడ్లను పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదని కార్పొరేషన్ నిధులతోనే అవన్నీ సజావుగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం సామాన్యులకే అధిక ప్రాధాన్యత కేటాయిస్తున్నామంటూ ప్రగల్పాలు పలికిన పాలకమండలి అధికారులు తమ ఎమ్మెల్యేలకు,మంత్రులకు యదేచ్చగా ప్రోటాకాల్ టికెట్టు ఇచ్చి దర్శనాలు చేయించుకుంటున్నారని, రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారని ఆరోపించారు.ఈ బోర్డు వచ్చిన తరువాత ఎమ్మెల్యే లకు,ఇతరులకు సుపదం ద్వార దర్శనాలు ఎదేచ్చా పంపు తున్నారని అన్నారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని, గత నెల రోజులలో ప్రోటోకాల్ దర్శనం సిసి ఫుటేజ్ విడుదల చేయగలరా అని సవాల్ విసిరారు భాను ప్రక్రష్. అధికారులు గానీ ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది గానీ ఎవరైనా సరే అఖిలాండడం వద్ద వచ్చి అవకతవకలు జరగడం లేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు.తిరుమల తిరుపతి దేవస్థానం ను జగన్ మోహన్ ఆలయం గా మార్చేసారని,
ఆర్టిఐ పరిధిలోకి టిటిడి ని కూడా తీసుకురావాలి అని బిజేపి డిమాండ్ చేస్తుందని అన్నారు.ధార్మిక క్షేత్రం లో సవాళ్ళు ప్రతి సవాళ్లు మంచిది కాదని అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన – టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు , వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సం.|| తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా , కొత్త రోడ్లు వెయ్యలేదు ,కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డు లో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.
తిరుపతి నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచారం కలకలం రేపింది. దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తీల్చారు. రాత్రి సమయంలో ఇంటి తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ కొట్టిడం.. వేరే రకమైన శబ్దాలు చేస్తూ ప్రమాదం ఉందని అనిపించినా.. ఎవరు నిర్ధారించుకోకుండా తలుపులు తీయవద్దని పోలీసులు హెచ్చరించారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. వెంటనే డైల్ 100 లేదా… దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి.. పోలీసు యంత్రాంగం తీవ్రమైన కృషి చేస్తుంది.
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అప్పంబట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేష్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం తిరుమల శ్రీవారిని 59,335 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ నెల 12న తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది.
తిరుమలలో అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాన్ని అందించే పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విరాళం మొత్తం గతంలో రూ.33 లక్షలు ఉండగా, ఆ మొత్తాన్ని టీటీడీ రూ.38 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.పెరిగిన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఉదయం అల్పాహారం కోసం రూ. 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చని టిటిడి ప్రకటించింది.
తిరుమల అక్టోబర్ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత పడుతుంది. ఎనిమిది గంటలకు పైగా ఆలయం తలుపులు టిటిడి అధికారులు మూసి వేయనున్నారు. 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా 28న రాత్రి 7:05 గంటలకు టీటీడీ అధికారులు ఆలయం మూసివేస్తామన్నారు. తిరిగి గ్రహణం విడిచాకా అక్టోబరు 29 తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం రద్దు చేశామన్నారు.
అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 చంద్రగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున జరుగనున్న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి 7:05ని.లకు ఆలయ తలుపులు మూసివేసి తిరిగి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు.





Total views : 62006