గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్త రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఏ వాహనం ఎప్పుడు, ఎక్కడకు వెళ్తోంది.. ఎంత చెత్తను రవాణా చేస్తోంది.. ఏ ప్రాంతానికి వెళ్తోంది.. అనే విషయాలను గుర్తించడం కష్టంగా మారిందని.. అందుకు వెహికిల్ ట్రాకింగ్ సిస్టం తీసుకురావాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వెహికిల్ ట్రాకింగ్ సిస్టంను మొదటి దశలో మూడు జోన్లలో పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టును అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. దీనికోసం ప్రత్యేక సెంటర్, సిబ్బందిని కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లలో 2 వేల 666 తీవ్రమైన చెత్త ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలోనే అత్యధికంగా జీవీపీలు ఉన్నాయి. వీటిలోని చెత్తను తీసుకెళ్లడానికి 75 చెత్త కంప్రెస్సింగ్ వాహనాలు ఉన్నాయి. వెహికిల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఆధారంగా వాటిని ట్రాకింగ్ చేయనున్నారు. తర్వాత శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఎల్.బీ. నగర్ జోన్లకు సంబంధించిన వాహనాలతో పాటు రాంకీకి సంబంధించిన వాహనాలను సైతం ట్రాకింగ్ సిస్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
చెత్త రవాణా చేస్తున్న వాహనాల ట్రాకింగ్ ప్రక్రియ తర్వాత ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్న ఆటో టిప్పర్లను సైతం ట్రాకింగ్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 4 వేల 500 ఆటో టిప్పర్లు ఉన్నాయి. వీటిపై నిఘా పెట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటు ఆటో టిప్పర్లు, అటు చెత్త రవాణా వాహనాలను ట్రాకింగ్ లోకి తీసుకువస్తే చెత్త నిర్వహణ మెరుగ్గా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్‌లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90109