వాట్సాప్(WhatsApp) కీలక నిర్ణయం..
యూజర్ల ప్రైవసీని పరిరక్షించేందుకు వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇకపై ఎవరూ ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్లు(Profile photos are screenshots) తీసుకొని మార్ఫింగ్ చెయ్యలేరు. వాట్సాప్ సాధారణంగా యూజర్ వన్ వ్యూ ఫొటో లేదా వీడియో స్క్రీన్ షాట్లను అనుమతించదు. ఇప్పుడు అదే ఫీచర్ ప్రొఫైల్ పిక్చర్(Profile picture)లో కూడా వచ్చింది. కొంతమంది మీకు తెలియకుండానే మీ ప్రొఫైల్ ఫోటో(Profile photo)ని సేవ్ చెయ్యడం లేదా స్క్రీన్ షాట్(Screen shot) తీసుకోవడం వంటివి చేస్తారు.
వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌ని స్క్రీన్ షాట్ తీస్తే..
అలాగే చాట్లు కూడా స్క్రీన్ షాట్లు(Screen shots) తీసుకుంటారు. ఇకపై వాట్సాప్ అలాంటి వాటిని అనుమతించదు. ఈ కొత్త ఫీచర్లో ఎవరైనా వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌ని స్క్రీన్ షాట్ తీస్తే, వారికి ప్రొఫైల్ ఫొటో(Profile photo) స్థానంలో నలుపు రంగు కనిపిస్తుంది. దాంతో వారి ఆటలు సాగవు. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను లాంచ్ చేశారు. ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్(Profile picture screenshot)తీస్తున్నప్పుడు ఒక మెసేజ్ కనిపిస్తుంది. ‘యాప్ పరిమితుల కారణంగా స్క్రీన్ షాట్లు తీసుకోలేరు’ అని అందులో ఉంటుంది.
వాట్సాప్ లోని ఈ ఫీచర్ పేరు ‘ స్క్రీన్ షాట్ టూల్ బ్లాకర్ ‘…
టెక్ నిపుణులు వాట్సాప్ యొక్క ఈ ఫీచర్‌ని ధృవీకరించారు. ఇది బాగా పనిచేస్తోందని అంటున్నారు. ఇది యూజర్ ప్రైవసీని పెంచుతుంది. చాట్ విండో నుంచి కాంటాక్ట్‌పై క్లిక్ చేస్తే, ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ తీయవచ్చని గుర్తించారు. ప్రైవసీ ఫీచర్ సెట్టింగ్‌ను మార్చే ఆప్షన్‌ను వాట్సాప్ ఇంకా ఇవ్వలేదు. ఫేస్బుక్లో ‘ ప్రొఫైల్ పిక్చర్ గార్డ్ ‘ అనే ఫీచర్ ఉంది, ఇది ఇతర వినియోగదారులు, ప్రొఫైల్ చిత్రాల స్క్రీన్ షాట్లు తియ్యనివ్వదు. వాట్సాప్ లోని ఈ ఫీచర్ పేరు ‘ స్క్రీన్ షాట్ టూల్ బ్లాకర్ ‘.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: యూట్యూబ్ ని తలదన్నేలా ఎక్స్ టీవీ యాప్..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి