ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)కి డిమాండ్ పెరుగుతోంది. దాదాపు అన్ని రంగాల్లోని కంపెనీలు ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. ఈ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఓపెన్ఏఐ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చాట్‌జీపీటీ ఉపయోగించేందుకు అకౌంట్ క్రియేట్ చేసి, సైన్ ఇన్ కావాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అందరూ ఈజీగా చాట్‌జీపీటీ సేవలను యాక్సెస్ చేసే అవకాశం కల్పించింది. మొదటి నుంచి ఓపెన్ ఏఐ తన AI చాట్‌బాట్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచింది. అయితే ప్లాట్ఫామ్లో అకౌంట్ క్రియేట్ చేసిన వారికే యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అకౌంట్ ఉంటేనే వివిధ ఫీచర్లకు యాక్సెస్ లభిస్తుంది, చాట్ హిస్టరీ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఓపెన్ ఏఐ కంపెనీ ఈ చాట్‌బాట్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలని భావిస్తోంది. ఇప్పుడు ఎవరైనా ఓపెన్ఏఐ ప్లాట్ఫామ్లో అకౌంట్ క్రియేట్ చేయకుండానే ChatGPT ఉపయోగించవచ్చు. టూల్ యూసేజ్ టైమ్‌ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో AI చాట్‌బాట్‌కి మరింత లెర్నింగ్ డేటా లభిస్తుంది.
ఇది చదవండి: Phone : ఫోన్‌ని ముందు జేబులో పెట్టుకుంటున్నారా..?
ఇంతకాలం చాట్‌బాట్ వాడని వారికి కూడా చాట్‌జీపీటీ పరిచయం అవుతుంది. ప్రస్తుతం 185 దేశాల్లోని 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు అనేక అవసరాల కోసం వారానికొకసారి అయినా చాట్‌జిపిటి వాడుతున్నారని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. అకౌంట్ సైన్-ఇన్ రిక్వైర్‌మెంట్‌ని తొలగించడంతో, AI చాట్‌బాట్‌ను కొత్తగా మిలియన్ల మంది వాడొచ్చని తెలిపింది. ఏఐ మోడల్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి డేటాను ఉపయోగించాల్సిన అవసరాన్ని కంపెనీ గ్రహించింది. అందుకే అకౌంట్ సైన్-ఇన్ లేకుండా జిపిటి ఉపయోగిస్తున్నప్పుడు యూజర్‌కి ఉన్న పరిమితులను కంపెనీ స్పష్టంగా తెలియజేస్తుంది. అకౌంట్ లేకుండా చాట్‌జిపిటి వాడే సమయంలో కూడా కంపెనీ యూజర్ల సమాచారాన్ని సేకరించవచ్చు. ఏఐ మోడల్ లెర్నింగ్కి ఈ డేటాను ఉపయోగించవచ్చు. అకౌంట్ లేకుండా వినియోగిస్తున్న యూజర్, తన డేటాకు యాక్సెస్ ఇవ్వకూడదని భావిస్తే, ఆ విషయాన్ని ముందుగానే స్పష్టం చేయాలి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.