ఇది Jeep కంపాస్ నైట్ ఈగిల్(Jeep Compass Night Eagle) 2024 వెహికిల్. ఇండియా(India)లో లాంచ్ అయిన ఈ వెహికిల్ పూర్తిగా బ్లాక్ కలర్ స్కీమ్‌తో వచ్చింది. మరి దీని స్టార్టింగ్ ధర, బుకింగ్ వివరాలు, కొత్త ఫీచర్లు అన్నీ తెలుసుకుందాం. ఈ నైట్ ఈగిల్ ఇంటీరియర్ కూడా బ్లాక్ థీమ్‌తోనే ఉంది. ప్రస్తుతం ఉన్న SUV రేంజ్‌కి మించిన ప్రీమియం ఫీచర్లతో ఈ జీప్ కంపాస్ నైట్ ఈగిల్ వచ్చింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్.. స్టాండర్డ్, సేఫ్టీ, కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చింది. ఇది మీకు రెడ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్‌లో కూడా లభిస్తుంది. ఈ జీప్ కంపాస్ నైట్ ఈగిల్‌కి 2.0 లీటర్ మల్టీ జెట్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. దీనికి 2 ఫార్వార్డ్ వీల్ డ్రైవ్ (FWD) ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 6 స్పీ్డ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. రిపోర్టుల ప్రకారం దీని ఇంజిన్ మాగ్జిమం 168bhp పవర్, 350Nm టార్క్ ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఈ కొత్త జీప్ కంపాస్ 2024 స్పెషల్ ఎడిషన్‌లో డ్రైవర్‌కీ, ప్యాసింజర్లకీ చాలా ఫీచర్లు, ఎమెనిటీస్ ఉన్నాయి.
ఇది చదవండి: గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకున్నారా..!
ఇంటీరియర్‌లో స్టాండర్డ్ ఫీచర్లను చూస్తే.. 10.25 అంగుళాల టచ్ స్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంది. అలాగే ఆనలాగ్ డయల్స్‌తో 7 అంగుళాల MID ఉంది. ఇంకా ఈ కారులో పానోరామిక్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, పుష్ బటన్ స్టార్ట్ లేదా స్టాప్ సామర్థ్యం, రియర్, ఫ్రంట్ డ్యాష్ క్యామ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు ఈ SUVలో స్టీరింగ్ వీల్కి మల్టీ ఫంక్షన్స్ ఉన్నాయి. డ్రైవర్‌కి మరింత ఎక్కువ కంఫర్ట్ ఇచ్చారు. అందువల్ల నడిపేవారికి ఇది బాగా నచ్చుతుంది. ఈ వెహికిల్‌లో 60కి పైగా ఇండియాలో రూపొందించిన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రయాణికులకు రక్షణ ఉంటుందని వివరించారు. జీప్ కంపాస్ నైట్ ఈగిల్ 2024 ధర ఇండియాలో రూ.25.04 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇండియాలో జీప్ కంపాస్ రేంజ్ ధర రూ.20.69 నుంచి ఉంది. ఈ ధరకు స్పోర్ట్స్ మోడల్ వస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.