అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేనే ఆఊరిని ఆగమాగం చేస్తున్నాడు. పేద, బడుగు జీవులకు నీడగా నిలవాల్సిన ఆయనే.. వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. క్రషర్ల పేరుతో ఆ ఊరంతా వల్లకాడు అవుతుంటే.. పట్టించుకోకుండా కాసులకు కక్కుర్తిపడి కోట్లు గడిస్తున్నాడు. దీంతో విసిగివేసారిపోయిన ఆ ఊరి జనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ సత్తా చూపిస్తామంటూ.. ఏకంగా 100 స్వతంత్ర నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న పటాన్ చెరు నియోజకవర్గం పేరుకు మిని ఇండియా.. ఇక్కడ దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు నివసిస్తుంటారు. దక్కణ్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని పటాన్ చెరు నియోజకవర్గంలో కొండలు.. గుట్టలు చరిత్రకు ఆనవాళ్లు… ఆ చారిత్రక ఆనవాళ్లను క్రషర్లతో కరిగించేస్తున్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. పటాన్ చెరుకు 10 కిలోమీటర్ల దూరంలోని లక్డారం గ్రామంలో 50కి పైగా క్రషర్లు ఏర్పాటు చేసి.. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా గుట్టల్ని పిండి చేస్తున్నారు. గుట్టలను పడగొట్టేటప్పుడు వచ్చే భారీ శబ్దాలతో గ్రామంలోని ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తుంటే.. దుమ్ము, దూళి కారణంగా అనేక మంది శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రుల పాలయ్యారు. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యేకు ఆ గ్రామ జనంపై కనికరం రాలేదు. ఇష్టానుసారంగా కొత్త కొత్త క్రషర్లకు అనుమతులు ఇప్పిస్తూ.. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదేంటని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విసిగి వేసారని లక్డారం ప్రజలు 200 రోజులకు పైగా దీక్ష చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలను అస్త్రంగా మార్చుకున్నారు. గూడెం మహిపాల్ రెడ్డికి పోటీగా పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థులుగా 100 మంది లక్డారం నుంచి నామనేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.
వాయిస్
తమ గ్రామానికి జరిగిన అన్యాయాన్ని, కాలుష్యంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకుని రావడానికి ఎన్నికల్లోపోటీ చేస్తున్నట్లు తేల్చి చెప్తున్నారు. లక్డారం పెద్ద చెరువు కింద కేఎస్ఆర్ మైనింగ్ క్రషర్ పనులను నిలిపివేయాలని గత 257 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష కేంద్రం నుంచి లక్షారం గ్రామస్తులు తమ పోరాటాన్ని ప్రకటించారు. లక్షారం గ్రామంలోని అన్ని వర్గాల
ప్రజలంతా ఏకమై అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చెయ్యడం ద్వారా తమ నిరసన తెలపడానికి సిద్ధమయ్యామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ లక్షారం గ్రామ పంచాయతీ పరిధిలో ఇష్టానుసారంగా క్రషర్లకు అనుమతులిస్తూ
తమ గ్రామాన్ని కాలుష్య బండగారంగా మార్చారని ఆరోపించారు. క్రషర్ ల ద్వారా వెలువడే కాలుష్యంతో భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వ్యవసాయం కుంటుపడుతుందని, ప్రజలు అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని, పర్యావరణానికి తీవ్రవిఘాతం కలుగుతుందని ఆవేదనవ్యక్తంచేశారు. ఒకప్పుడు మండలంలోని పాడి పంటలతో అభివృద్ధి చెందిన గ్రామంగా ఉన్న లక్షారం క్రషర్లపుణ్యమా అని వెనకపడిందని బాధ పడ్డారు. గ్రామంలో వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన పెద్ద చెరువు విధ్వంసానికి గురయ్యేఅవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.