భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem) అశ్వారావుపేట లోని పేపర్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఫ్యాక్టరీ వెనుక భాగంలో వేస్ట్ పేపర్ స్టోర్ వద్ద ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలు చూసి చుట్టుపక్కల నివాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఎట్టకేలకు ఫ్యాక్టరీ సిబ్బంది మంటలు అదుపు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన అనుభవమున్నప్పటికీ.. ఫ్యాక్టరీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు తీసుకున్న ఆనవాళ్లు మచ్చుకు కూడా కనపడవు.
నేడు ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
తక్కువ జీతాలకు వచ్చే ఇతర రాష్ట్రాల వారిని తీసుకువచ్చి ఇక్కడ పనిచేయిస్తున్న సమయంలో, ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేస్తారని ఆరోపణలు లేకపోలేదు. ఫ్యాక్టరీ వ్యర్థాల చుట్టూ పక్కల కాలనీల్లో పడుతున్నాయని కాలనీ వాసులు నిత్యం గొడవలు చేస్తూనే వుంటారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి ఫ్యాక్టరీ పై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.