కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరు గ్యారెంటీల అమలుపై సంతకం చేసి, అఫిడవిట్ తో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై మేనిఫెస్టోను పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ కు మెడికల్ కళాశాల రాబోతోందని, హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లు ఇస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలోని కాలువల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపిస్తామన్నారు. రాష్ట్రంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
వంద రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు..
59
previous post