ఎప్పుడూ వార్తల్లో నిలిచే జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. దళితబంధు ఇప్పిస్తానంటూ మాముళ్లు వసూలు చేసి ముఖం చాటేశారని దూల్మిట్ట ఎంపిపి కృష్ణారెడ్డి మండిపడుతున్నారు. ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని 62 మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు తీసుకుని దళితబంధు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అయితే దళితబంధు రాకపోవడంతో మామూళ్లను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ముత్తిరెడ్డి స్పందించలేదు. దీంతో నష్టపోయిన బాధితులందరూ హనుమంతపూర్ గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ వద్ద నిరసన తెలిపారు. మా డబ్బులు వెంటనే ఇవ్వకపోతే తమ నివాసం ముట్టడిస్తామని హెచ్చరించారు. ముత్తిరెడ్డి చేసిన మోసాలన్నీ నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణారెడ్డి తెలిపారు. జనగామ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రెండు కోట్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కోసం 40 లక్షలు ముత్తిరెడ్డి తీసుకున్నారని ఆరోపించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రతి దాంట్లో కూడా ముత్తిరెడ్డి వాటాలు తీసుకునే వారని కృష్ణారెడ్డి మండిపడ్డారు.
వివాదంలో చిక్కుకున్న ముత్తిరెడ్డి
64
previous post