నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హెచ్చరించారు. రైతులకు విత్తనాలను సకాలంలో సరఫరా చేసేందుకు యూనివర్శిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా వచ్చే సీజన్ లో రైతులకు విత్తన సరఫరా మరియు నాణ్యమైన విత్తన లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విత్తన లభ్యతలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులు మరియు విత్తన కంపెనీలను ఆదేశించారు. విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు అధికా ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు సూచించారు. నకిలీ విత్తనాల వలన రైతులకు ఏదైనా నష్టం జరిగితే విత్తన కంపెనీలు తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆదేవిధంగా, తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
65
previous post