62
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1, 2024 రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రభుత్వాన్ని నడిపించే ఆర్థిక ప్రణాళిక. 2024-25 ఆర్థిక ఏడాదికి గానూ రథసారథి. ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆదాయం, వ్యయాల ప్రణాళికలను వివరిస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2024 జనవరి చివరి వారంలో మొదలై ఏప్రిల్లో ముగుస్తాయి.